Anantapur: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టాలని.. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్

By అంజి  Published on  24 April 2023 11:22 AM IST
Anantapur ,  Tadipatri, JC Prabhakar Reddy, TDP

Anantapur: తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన చేపట్టాలని.. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక తరలింపును పరిశీలించేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు అతన్ని ఇంటి నుంచి బయటకు రావద్దని, గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించారు. జేసీ నివాసానికి వెళ్లేందుకు మీడియాను పోలీసులు అనుమతించడం లేదు, ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా జేసీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జేసీ హౌస్ అరెస్టుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం జేసీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్దపప్పూరు మండలంలో జేసీ నివాసం చుట్టూ బారికేడ్లు వేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల కళ్లు గప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చారు. రోడ్డుపైనే పోలీసుల తీరును నిరసించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు, జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Next Story