Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు మృతిచెందారు.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 3:10 AM GMTAnantapur: ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గార్లదిన్నే మండలం కల్లూరు గ్రామం దగ్గర బస్సు, ట్రాక్టర్ ఒకదానిని మరోటి ఢీకొన్నాయి. దాంతో.. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో ఒక ట్రాక్టర్ బయల్దేరింది. వేగంగా వచ్చిన ట్రావెల్స్ బస్సు, ట్రాక్టర్ ఒకదానిని మరోటి ఢీకొన్నాయి. దాంతో.. ట్రాక్టర్‌పై ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులు గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చనిపోయిన నలుగురూ రైతులు అని పోలీసులు గుర్తించారు. మృతులు గుత్తి మండలం మామిడూరుకి చెందిన చిన్నతిప్పయ్య (45), శ్రీరాములు (45), శ్రీనివాసులు (30), నాగార్జున (30)గా పోలీసులు గుర్తించారు.
నలుగురు చనిపోయిన సమాచారాన్ని వారివారి కుటుంబ సభ్రయులకు అందించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించామన్నారు. ఇదే ప్రమాదంలో ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయని పోలీసులు చెప్పారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. గాయపడ్డ నరేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు చెప్పారు. దాంతో.. అతడిని వెంటనే అనంతపురం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇంకా ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.