నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చిన అనంతపురం పోలీసులు

నారా లోకేష్‌కు అనంతపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.

By M.S.R  Published on  11 April 2023 10:00 AM GMT
Nara Lokesh, TDP, Yuvagalam, APnews

నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చిన అనంతపురం పోలీసులు 

నారా లోకేష్‌కు అనంతపురం పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. విధ్వంసానికి దారి తీసే ఏ పని, హింసను ప్రేరేపించేలా ఎలాంటి మెటిరియల్ పంపిణీ చేయొద్దన్నారు. లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు తాడిపత్రి డిఎస్పీ వెళ్లగా నోటీసులు తీసుకునేందుకు లోకేష్‌ నిరాకరించారు. లోకేష్ తిరస్కరించడంతో యాడికి టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడికి పోలీసులు నోటీసులు అందజేశారు.

గత 67 రోజులుగా నేను పాదయాత్ర చేస్తున్నా.. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం లేదని డీఎస్పీకి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతిని.. ఎమ్మెల్యే అవినీతిని కచ్చితంగా తాను ఎండగడతానని తెలిపారు. శింగనమల నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర పూర్తి అయ్యింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాడిపత్రికి చేరుకుని లోకేష్‌కు పూలమాలతో స్వాగతం పలికారు.

Next Story