సీఎం జ‌గ‌న్‌కు ఆనంద‌య్య లేఖ‌.. ఏం అడిగారంటే..?

Anandaiah wrote a letter to ap cm jagan.నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన‌ ఆనందయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 8:02 AM GMT
సీఎం జ‌గ‌న్‌కు ఆనంద‌య్య లేఖ‌.. ఏం అడిగారంటే..?

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన‌ ఆనందయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మందు తయారీకి సహకరించాలని కోరారు. ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ‌ చేయించాల‌న్నారు. అలాగే.. ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని, ఎక్కువ మొత్తంలో మందుల‌ను త‌యారీ చేసి ఇత‌ర రాష్ట్రాల‌కు పంపిణీ చేసే విధంగా స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల‌న్నారు. మందు త‌యారీకి విద్యుత్ సౌక‌ర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాల‌ని లేఖ‌లో ఆనంద‌య్య కోరారు. అలాగే మందు త‌యారీకి విద్యుత్ సౌక‌ర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాల‌న్నారు.

ఇదిలా ఉంటే.. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది. నేడు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో మందును పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ ఔష‌దాన్ని ఇంటింటికీ చేర‌వేస్తున్నారు. మందు కోసం ఇత‌ర ప్రాంతాల నుంచి ఇక్క‌డి వ‌చ్చేవారిని పోలీసులు అనుమ‌తించ‌డం లేదు. ప్ర‌స్తుతం కృష్ణ‌ప‌ట్నంలో 144 సెక్ష‌న్ అమ‌లు అవుతోంది.

Next Story