నారా లోకేష్‌ను క‌లిసిన వైసీపీ ఎమ్మెల్యే కూతురు

Anam Ramanarayanareddy daughter Kaivalyareddy Meet Nara Lokesh. ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్య‌క్ర‌మం జరుగుతోంది

By Medi Samrat  Published on  28 May 2022 2:18 PM IST
నారా లోకేష్‌ను క‌లిసిన వైసీపీ ఎమ్మెల్యే కూతురు

ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్య‌క్ర‌మం జరుగుతోంది. మహానాడు రెండో రోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేత‌, ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నార‌య‌ణ‌ రెడ్డి కూతురు కైవల్య రెడ్డి, త‌న భ‌ర్త రితేష్ రెడ్డితో స‌హా టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. ఆనం రామ‌నార‌య‌ణ‌ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే.. జగన్ తన సీనియారిటీని పట్టించుకోవడం లేద‌ని ఆయన పార్టీలో ఉన్నా అసంతృప్తితో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయన వైసీపీను వీడి టీడీపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూర్చే విధంగా ఆనం కూతురు నారా లోకేష్‌ను క‌లిశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలావుంటే.. మ‌రికొంత‌మంది వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కొందరు టీడీపీ వైపు చూస్తున్నారని, స‌రైన సమయంలో పార్టీలో చేరతారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కైవల్యా రెడ్డి రాబోయే ఎన్నిక‌ల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆనం వార‌సురాలిగా రాజ‌కీయ ఆరంగ్రేటం చేస్తున్న కైవ‌ల్యా రెడ్డి.. నెల్లూరు జిల్లాలో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు పరిచయం అయ్యేందుకు ప్రయత్నాలు ఆరంభించిన‌ట్లు తెలుస్తోంది.












Next Story