వైసీపీకి అప్పుడే గుడ్‌బై చెప్పేసిన అంబటి రాయుడు

వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్‌ ఇచ్చారు. గతవారమే ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 12:01 PM IST
ambati rayudu, goodbye, ycp, andhra pradesh, politics,

వైసీపీకి అప్పుడే గుడ్‌బై చెప్పేసిన అంబటి రాయుడు 

వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్‌ ఇచ్చారు. గతవారమే ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే.. అప్పుడే సంచలన ప్రకటన చేశాడు. తాను వైఎస్‌ఆర్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు. అయితే.. పార్టీలో చేరిన 10 రోజుల్లోనే రాజీనామా చేస్తున్నానని చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే.. గత గురువారం డిసెంబర్ 28న సీఎం జగన్ సమక్షంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. సచివాలయంలో అంబటి రాయుడుకి శాలువా కప్పి జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. రాజకీయాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంబిస్తున్నట్లు అప్పుడు చెప్పారు అంబటి రాయుడు. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మొదట్నుంచి తనకు సీఎం జగన్‌పై మంచి అభిప్రాయం ఉందని చెప్పాడు. సీఎం జగన్ కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు అంబటి రాయుడు గతవారం చెప్పారు. కానీ.. అంతలోనే వైసీపీకి అంబటి రాయుడు షాక్‌ ఇచ్చారు.

ముందుగా తమ పార్టీలో చేరడంతో ఎన్నికల వేళ వైసీపీకి పాజిటివ్‌ అవుతుందని అందరూ భావించారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారంటూ వార్తలు వచ్చాయి. అంబటి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కలిసి వస్తుందని అనుకున్నారు. కానీ.. రాజకీయాల్లో కొనసాగడంపై అంబటి రాయుడు యూటర్న్ తీసకున్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అంబటి రాయుడు చెప్పారు.

అయితే.. కొందరు టికెట్‌ కారణాలతోనే అంబటి రాయుడు రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో.. ఆయన మరో పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో జనసేనలో చేరే అవకావాలున్నాయని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. కానీ.. అంబటి రాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story