టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కంగ్రాట్స్: అంబటి రాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి దూసుకెళ్తుంది

By Srikanth Gundamalla
Published on : 4 Jun 2024 1:14 PM IST

ambati rayudu,  tdp, janasena,  election resutls,

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కంగ్రాట్స్: అంబటి రాయుడు     

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి దూసుకెళ్తుంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది టీడీపీ. జనసేన కూడా ముందంజలో ఉంది. అధికార పార్టీ వైసీపీకి మాత్రం రాష్ట్ర ప్రజలు షాక్‌ ఇచ్చారు. పూర్తిగా వెనుకబడి పోయింది. దాంతో.. కూటమి ఘనవిజయం ఖాయమనీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అర్థం అవుతోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కూటమి పార్టీలకు కాంగ్రాట్స్ చెప్పాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టాడు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలకు ఎక్స్ వేదికగా అంబటి రాయుడు శుభాకాంక్షలు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేతులు కలిపారని చెప్పారు. వారి నాయకత్వంలో ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు అంబటి రాయుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన చేపట్టిన పాదయాత్ర కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని అంబటి రాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.

Next Story