అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ డీఎస్సీ సిలబస్ విడుదల
మెగా డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఏపీ విద్యాశాఖ ముందుగా సిలబస్‌ను విడుదల చేసింది.
By అంజి Published on 28 Nov 2024 6:42 AM ISTఅభ్యర్థులకు అలర్ట్.. ఏపీ డీఎస్సీ సిలబస్ విడుదల
మెగా డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఏపీ విద్యాశాఖ ముందుగా సిలబస్‌ను విడుదల చేసింది. ఎస్జీటీ అభ్యర్థులు జీకే, కరెంటర్ అఫైర్స్ (8 మార్కులు), పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ (4 మార్కులు), ఎడ్యుకేషన్ సైకాలజీ (8 మార్కులు), కంటెంట్ అండ్ మెథడాలజీకి (60 మార్కులు) సంబంధించిన సిలబస్‌ను విడుదల చేసింది. ఎస్జీటీ అభ్యర్థులు కంటెంట్‌ను 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకోవాలని, ప్రశ్నల స్థాయి పదో తరగతి స్థాఆయిలో ఉంటాయని తెలిపింది.
స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు జీకే, కరెంట్ అఫైర్స్ (10 మార్కులు), పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ (5) మార్కులు, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ (5 మార్కులు), కంటెంట్ (40 మార్కులు) 7వ తరగతి నుంచి ఇంటర్ స్థాయి వరకు వివరంగా సబ్జెక్ట్‌కు సంబంధించిన టాపిక్స్ ఇచ్చింది. మెథడాలజీ (20 మార్కులు) సిలబస్‌ను పేర్కొంది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు న్యాయవివాదాలు తలెత్తకుండా ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషనర్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు ఆలోపు చదువుకోవడానికి ముందుగా సిలబస్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి సిలబస్‌ను https://apdsc2024.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.