వైసీపీ నేత జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  13 Aug 2024 9:29 AM IST
acb raids,  ycp,  jogi Ramesh, Andhra Pradesh,

వైసీపీ నేత జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్‌ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. దాదాపు 15 మంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొన్నారు. అయితే.. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేశ్‌పై ఆరోపణలు వచ్చాయి. దాంతో.. చాలా మంది బాధితులు ఆయనపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సోదాలు మొదలుపెట్టారు.

మంత్రి హోదాలో ఉన్న సమయంలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు..? ఏవిధంగా ప్రభుత్వ నిబంధనలకు కాదని కాంట్రాక్ట్‌లు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు అరా తీస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే కీలకమైన డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జోగి రమేశ్‌ ఇంట్లో తనిఖీలకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story