చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ సీఐడీ మరో షాక్‌ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  11 Sept 2023 3:39 PM IST
ACB Court, another petition, chandrababu, AP CID,

చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మరో పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ సీఐడీ మరో షాక్‌ ఇచ్చింది. ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్ పిటిషన్‌ దాఖలు చేసింది సీఐడీ. ఇక ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీం స్కాం కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విచారణకు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు తాము దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబుతోపాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్‌ల పేర్లను సైతం పొందుపరిచింది సీఐడీ. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పులో చంద్రబాబుతో పాటు నారాయణ, లోకేశ్‌లదే కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయని తెలిపింది. ఈ కేసులో కుంభకోణంపై సీఐడీ సమగ్ర దర్యాప్తు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. ఏ–1గా చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్, ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్‌ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే.

Next Story