ఏపీలో ఘోర ప్రమాదం, ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

పల్నాడు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది

By -  Knakam Karthik
Published on : 5 Dec 2025 8:54 AM IST

Andrapadesh, Palnadu district, Five students died

ఏపీలో ఘోర ప్రమాదం, ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

ఆంధ్రప్రదేశ్‌: పల్నాడు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకలూరిపేట సమీపంలోని జాతీయ రహదారి 16పై గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో మరణించారు. ప్రమాదానికి గురైన కారులో మొత్తం ఆరుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కాగా ముందు వెళ్తున్న లారీని, కారు వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరం. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

Next Story