ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.

By అంజి  Published on  30 Sept 2024 6:45 AM IST
central survey, girls, AP news, Boys, kerala

ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య 

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2023 జులై నుంచి 2024 జూన్‌ వరకు కేంద్రం సర్వే నిర్వహించి ఈ గణాంకాలు ప్రకటించింది. దేశంలో 11 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో కేరళ టాప్‌లో ఉండగా.. మేఘాలయ, ఒడిశా, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఏపీ ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1032 మంది అమ్మాయిలు ఉన్నారు. 2019 - 2020 లో ఏపీలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1021 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1019 మంది అమ్మాయిలు, పట్టణ ప్రాంతాల్లో 1064 మంది అమ్మాయిలు ఉన్నట్టు సర్వే తెలిపింది.

ఇక కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1138 మంది అమ్మాయిలు ఉన్నారు. దేశం మొత్తంగా చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే అమ్మాయిల సంఖ్య గతంలో కంటే పెరిగిందని తాజా రిపోర్ట్‌ చెబుతోంది. అటు అమ్మాయైనా, అబ్బాయైనా.. ఒక్కరు చాలానుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపింది.

Next Story