ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,851 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 993 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,00,805కి చేరింది. అత్యధికంగా గుంటూరులో 198 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరిలో 12 కేసులు నమోదు అయ్యాయి.
నిన్న ఒక్క రోజే 480 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా 8,86,978 కోలుకున్నారు. కరోనా వల్ల గుంటూరు, కృష్ణ, మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,213కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,50,52,215 శాంపిల్స్‌ని పరీక్షించారు.