ఏపీలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు
958 New corona cases in ap.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో
By తోట వంశీ కుమార్ Published on 26 March 2021 12:30 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 40,604 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 958 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,96,863కి చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కాగా, విశాఖ జిల్లాలో 170, చిత్తూరు జిల్లాలో 163 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల చిత్తూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య 7,203కి చేరింది. ఇక ఒక్కరోజులో 306 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8,85,515కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,49,16,201 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
#COVIDUpdates: 26/03/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 26, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,93,968 పాజిటివ్ కేసు లకు గాను
*8,82,620 మంది డిశ్చార్జ్ కాగా
*7,203 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,145#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kwSZcMETRD