ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు
2025–26 ఖరీఫ్ సీజన్‌కు వరి సేకరణ చివరి దశలో ఉందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు...
By - అంజి |
ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు
అమరావతి: 2025–26 ఖరీఫ్ సీజన్‌కు వరి సేకరణ చివరి దశలో ఉందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94 శాతం నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.
పౌర సరఫరాల భవన్‌లో శాఖాపరమైన కార్యకలాపాలపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మనోహర్ ప్రసంగిస్తూ.. ఖరీఫ్ సీజన్‌లో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవడానికి రాబోయే రబీ సీజన్‌లో సేకరణకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తేమ శాతం, GPS ట్రాకింగ్, రవాణాకు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 6,83,623 మంది రైతులు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని విక్రయించారని, దీని విలువ దాదాపు ₹9,890 కోట్లు ఉంటుందని మంత్రి తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీఎస్ డిల్లీ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.