ఏపీలో కరోనా తగ్గుమఖం.. కొత్తగా ఎన్నికేసులంటే..?
8976 New corona cases reported in ap.ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖంపట్టాయి. గడిచిన
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2021 12:04 PM GMTఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖంపట్టాయి. గడిచిన 24 గంటల్లో 83,690 శాంపిళ్లను పరీక్షించగా.. 8,976 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,58,339కి చేరింది. నిన్న 13,568 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,23,447కి పెరిగింది.
#COVIDUpdates: 06/06/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 6, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,55,444 పాజిటివ్ కేసు లకు గాను
*16,20,552 మంది డిశ్చార్జ్ కాగా
*11,466 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,23,426#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/SkzcWc6Chm
కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది, అనంతపురంలో ఎనిమిది, గుంటూరులో ఎనిమిది, శ్రీకాకుళంలో ఎనిమిది, విజయనగరంలో ఎనిమిది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, కర్నూలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,466కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,23,426 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,97,91,721 సాంపిల్స్ ని పరీక్షించారు.