ఏపీ క‌రోనా బులెటిన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..?

82 New corona cases in AP.ఏపీ‌లో గడచిన 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 5:55 PM IST
ఏపీ క‌రోనా బులెటిన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..?

ఏపీ‌లో గడచిన 24 గంటల్లో 35,443 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్ కేసులు నిర్థ‌రాణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,89,585కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు నమోదు కాగా, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 74 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,81,806కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక్క‌రు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 7,168కి చేరింది. కాగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,38,43,190 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.





Next Story