ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు

79 New corona cases in AP.ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి.గ‌డిచిన 24 గంట‌ల్లో 28,254 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..79 పాజిటివ్ కేసులు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2021 12:34 PM GMT
79 New corona cases in AP

ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 28,254 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..79 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,178కి చేరింది. నిన్న ఒక్క రోజే 87 మంది కోలుకుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,79,867కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,154 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో క‌రోనాతో ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమ‌హ‌మ్మారి కార‌ణంగా 7,157 మంది ప్రాణాలు కోల్పోయారు.Next Story
Share it