76th Republic Day: జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
తెలుగు రాష్ట్రాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి
76th Republic Day: జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
తెలుగు రాష్ట్రాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
అటు తెలంగాలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఎగురవేశారు. సాయుధ దళాల గౌరవ వందనాలను స్వీకరించారు. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్‌లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం అక్కడే జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.
తెలంగాణ శాసనమండలిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మువ్వన్నెల పతాకానికి సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.