ఈ పెద్దాయన గ్రేట్..64 ఏళ్ల వయసులో గేట్‌లో 140వ ర్యాంకు

64 Years Satyanarayana reddy got 140 rank in Gate.చ‌దువుకు వ‌య‌సు అడ్డంకి కాదు. చ‌దుకోవాల‌న్న కోరిక ఉండాలే గానీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2022 4:26 AM GMT
ఈ పెద్దాయన గ్రేట్..64 ఏళ్ల వయసులో గేట్‌లో 140వ ర్యాంకు

చ‌దువుకు వ‌య‌సు అడ్డంకి కాదు. చ‌దుకోవాల‌న్న కోరిక ఉండాలే గానీ ఏ వ‌య‌సులోనైనా చ‌దువుకోవ‌చ్చు. కొంద‌రు ప‌ని చేస్తూ చ‌దువుకొంటున్న వారిని మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఉద్యోగ విర‌మ‌ణ చేసిన త‌రువాత కూడా ఉన్న‌త చ‌దువులు చ‌దివే వారు చాలా అర‌దు. అనంత‌పురం ప‌ట్ట‌ణానికి చెందిన వి.స‌త్య‌నారాయ‌ణ రెడ్డి ఇంజినీరుగా ఉద్యోగ విర‌మ‌ణ చేసిన త‌రువాత 64 ఏళ్ల వ‌య‌సులో గేట్ ప‌రీక్ష రాసి.. జాతీయ స్థాయిలో 140 వ ర్యాంకు సాధించారు.

సత్యనారాయణరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం 2019లో జేఎన్‌టీయూలో సివిల్ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ ప‌రీక్ష రాసి.. జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపర్‌లో జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సాధించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గేట్‌ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి మూడేళ్ల పాటూ అవకాశం ఉంటుందని.. కుటుంబసభ్యులతో చర్చించి ముంబై, రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), రిమోట్‌ సెన్సింగ్‌ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విష‌యం తెలిసిన నెటీజ‌న్లు మీరు చాలా గ్రేట్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story