ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,741 పరీక్షలు నిర్వహించగా.. 5,086 పాజిటివ్ కేసులు నిర్ధరాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైప పాజటివ్ కేసుల సంఖ్య 9,42,135కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాఓ 617 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 31 కేసులు నమోదు అయ్యాయి.
నిన్న ఒక్క రోజే చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపూర్, కర్నూల్, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,745 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 9,03,072 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,55,70,201 శాంపిల్స్ ను పరీక్షించారు.