ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

4 Ayyappa Devotees Died After Auto Overturned In Aps Bapatla. ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఎస్‌ బోల్తాపడడంతో నలుగురు అయ్యప్ప

By అంజి  Published on  5 Dec 2022 10:01 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటాఎస్‌ బోల్తాపడడంతో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లాలోని వేమూరు మండలం జంపని దగ్గర ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. మృతులంతా కృష్ణా జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మొత్తం నలుగురు మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అయ్యప్ప భక్తులు టాటాఎస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని తెనాలి ఆసుప్రతికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లంలో నిన్న ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. పెద్ద‌షాపూర్ వ‌ద్ద గుర్తు తెలియ‌ని వాహ‌నం ఓ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

Next Story