ఏపీలోని ఆగని కరోనా విజృంభణ.. కొత్తగా ఎన్నికేసులంటే..?
3495 New corona cases in AP.ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 31,719 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,495 పాజిటివ్ కేసులు నమోదు
By తోట వంశీ కుమార్ Published on
11 April 2021 11:41 AM GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 31,719 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,495 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719 కేసులు నమోదు కాగా.. ఆతరువాత గుంటూరు జిల్లాలో 501, విశాఖ జిల్లాలో 405 పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,25,401 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఈమహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 7,300కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,198 కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,97,147కి చేరింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,54,29,391 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో వెల్లడించారు
Next Story