ఏపీ కరోనా అప్‌డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే
3464 Covid-19 New corona cases reported in AP.ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో
By తోట వంశీ కుమార్ Published on 2 July 2021 6:03 PM ISTఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 93,759 శాంపిళ్లను పరీక్షించగా.. 3,464 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,85,716కి చేరింది. నిన్న 5,757 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,96,818కి పెరిగింది.
#COVIDUpdates: 02/07/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) July 2, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,93,923 పాజిటివ్ కేసు లకు గాను
*18,43,821 మంది డిశ్చార్జ్ కాగా
*12,779 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 37,323#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dycW9eWsZY
కోవిడ్ వల్ల చిత్తూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు, కర్నూలులో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,779కి చేరింది. ఇక రాష్ట్రంలో 37,323 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,21,77,951 సాంపిల్స్ ని పరీక్షించారు.