పెండింగ్ రెవెన్యూ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

రాష్ట్రంలో 10.2.2026 నాటికి 32,970 రెవెన్యూ కేసులు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

By -  Medi Samrat
Published on : 4 March 2026 8:00 PM IST

పెండింగ్ రెవెన్యూ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

రాష్ట్రంలో 10.2.2026 నాటికి 32,970 రెవెన్యూ కేసులు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.2005 వరకు 4 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉండగా, 2006 నుండి 2010 వరకు 204 కేసులు, 2011 నుండి 2015 వరకు 1809 కేసుల, 2016 నుండి 2020 వరకు 17,291 కేసులు, 2021 నుండి 2025 వరకు 12,434 కేసలు, 2026 నుండి ఇప్పటి వరకు 1228 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటన్న వివిధ చర్యల కారణంగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని తెలిపారు. హైకోర్టులో నమోదైన కేసుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో లైజనింగ్ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నాయకత్వంలో లీగ్ సెల్ ను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఈ లీగల్ సెల్ జిల్లాకు సంబంధించిన కోర్టు కేసులను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోందని అన్నారు. కోర్టు కేసుల నిర్వహణ కోసం రెవెన్యూ శాఖ ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తోందన్నారు. ఈ వ్యవస్థ వల్ల జిల్లా అధికారులకు మరియు ప్రభుత్వ ప్లీడర్లకు మధ్య సమన్వయం పెరిగిందని, దీనివల్ల చాలా కేసులు ప్రారంభ దశలోనే పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. అయితే భూ వివాద కేసుల పరిష్కారంలో ఎవరైనా అధికారులు తప్పు చేస్తే సహించేది లేదన్నారు. లైజనింగ్ ఆఫీసర్లు కుమ్మక్కయినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ వివాదాల్లో రికార్డులను తారుమారు చేసిన కొందరు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు కేసులను మరింత సమర్ధవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Next Story