ఏపీలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 51,027 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 289 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజాగా విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,876కి చేరింది. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 8,73,855 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 2,896 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్ వ‌ల్ల కృష్ణ‌, ప్ర‌కాశం, విశాఖ‌ప‌ట్నం లో ఒక్కొక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 7,125కి చేరింది. నేటి వ‌ర‌కు రాష్ట్రంలో 1,21,05,121 శాంపిల్స్‌ను ప‌రీక్షించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story