ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,417 కరోనా పరీక్షలు నిర్వహించగా 261 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,92,269కి చేరింది. అత్యధికంగా చిత్తూరు గుంటూరు జిల్లాలో 40 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖపట్నం జిల్లాలో 39 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 37, కృష్ణా జిల్లాలో 34 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 125 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,83,505 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,579 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన 7,185 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,45,80,783 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.