ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 31,812 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,331 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 నమోదు కాగా.. ఆతరువాత కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి.
అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,13,274 కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారి కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 7,262కి చేరింది. నిన్న ఒక్క రోజే 853 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,92,736కి చేరింది.