ఏపీలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం 20వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 96,446 శాంపిళ్లను పరీక్షించగా.. 22,399 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785కి చేరింది. నిన్న 18,638 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 11,56,66కి పెరిగింది.
నిన్న విశాఖపట్నంలో 11 మంది, విజయనగరంలో 11 మంది, చిత్తూరులో తొమ్మిది మంది, తూర్పుగోదావరిలో తొమ్మిది మంది, కృష్ణలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, నెల్లూరులో ఐదుగురు, కడపలో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు చొప్పున మొత్తం 89 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9,077కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,01,042కి చేరింది.