ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
2224 Covid-19 New corona cases reported in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2021 11:49 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 71,758 శాంపిళ్లను పరీక్షించగా.. 2,224 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,82,096కి చేరింది. నిన్న 4,714 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,27,214కి పెరిగింది.
#COVIDUpdates: 28/06/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,79,201 పాజిటివ్ కేసు లకు గాను
*18,24,319 మంది డిశ్చార్జ్ కాగా
*12,630 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 42,252 #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dxyECsyMtf
కోవిడ్ వల్ల చిత్తూరులో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపురంలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,630కి చేరింది. ఇక రాష్ట్రంలో 42,252 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,18,04,691 సాంపిల్స్ ని పరీక్షించారు.