ఏపీలో క‌రోనా తీవ్ర‌రూపం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

1730 New corona cases in AP.ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 31,072 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా 1,730 మందికి క‌రోనా పాజిటివ్‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2021 12:56 PM GMT
AP Corona cases

ఏపీలో క‌రోనా తీవ్ర రూపం దాల్చుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,072 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా 1,730 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట‌, వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,07,676 కి చేరింది. చిత్తూరులో జిల్లాలో 338, విశాఖ‌లో 235 కేసులు న‌మోదు కాగా.. అత్పల్పంగా ప‌శ్చిమ గోదావ‌రిలో 10 కేసుల‌ను గుర్తించారు. నిన్న ఒక్క రోజే ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,239కి చేరింది.

ఒక్క రోజు వ్య‌వ‌ధిలో 842 ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకుగా మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,90,137కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,52,08,436 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.


Next Story
Share it