తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌రోనా క‌ల‌క‌లం.. 16 మంది వైద్య విద్యార్థుల‌కు పాజిటివ్‌

16 Students positive in East Godavari District.తూర్పు గోదావరి జిల్లాలో కరోనా క‌ల‌వ‌రం రేపుతోంది. హాస్టల్‌లో ఉంటున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2021 11:09 AM IST
తూర్పుగోదావ‌రి జిల్లాలో క‌రోనా క‌ల‌క‌లం.. 16 మంది వైద్య విద్యార్థుల‌కు పాజిటివ్‌

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా క‌ల‌వ‌రం రేపుతోంది. హాస్టల్‌లో ఉంటున్న వారిలో 16 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్టల్‌లో రెండు వంద‌ల మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరింద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. ఇందులో 16 మంది విద్యార్థుల‌కు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.బాజ్జి సోమ‌వారం తెలిపారు. పాజిటివ్ వ‌చ్చిన విద్యార్థులంద‌రిని ఓ ప్ర‌త్యేక గ‌దిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవ‌ల ఓ మెడిక‌ల్ విద్యార్థి ఢిల్లీలో ఫంక్ష‌న్‌కు వెళ్లి వ‌చ్చిన క్ర‌మంలో క‌రోనా వ్యాపించిన‌ట్లు అధికారులు బావిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం కొత్త‌గా 220 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 4గురు మృతి చెందారు. 429 మంది కోలుకున్నారు. కొత్తగా న‌మోదు అయిన కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 20,66,670 చేర‌గా.. 20,48,151మంది కోలుకున్నారు. క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టికి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 14,377కి చేరింది.

Next Story