ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61,298 శాంపిళ్లను పరీక్షించగా.. 1,540 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,57,932కి చేరింది. నిన్న 2,304 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,23,675కి పెరిగింది.
కోవిడ్ వల్ల ప్రకాశంలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు,నెల్లూరులో ఇద్దరు, కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,292కి చేరింది. ఇక రాష్ట్రంలో 20,965 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,42,53,931 సాంపిల్స్ ని పరీక్షించారు.