కృష్ణా జిల్లా నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలోని చెవిటిక‌ల్లు వ‌ద్ద కృష్ణా న‌దిలో వ‌ర‌ద ఉద్దృతి ఒక్క‌సారిగా పెరిగింది. దీంతో న‌దిలో ఇసుక కోసం వెళ్లిన లారీలు వ‌ర‌ద‌లో చిక్కుకున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన వరదలో లారీలు చిక్కుకోవడంతో ఆందోళన నెలకొంది. లారీలు ఇసుక లోడింగ్ కోసం వెళ్లే క్ర‌మంలో లారీ డ్రైవర్లు ఎవరికి వారు తామే ముందుగా లోడ్ చేయించుకోవాలని పోటీపడి మరి వాగులోకి వెళ్లారు. ఈ సమయంలో రహదారి కూడా కొంత దెబ్బతిన్నది.

అకస్మాత్తుగా కృష్ణానదికి వరద రావడంతో లారీలన్నీ అక్కడే చిక్కుకున్నాయి. వెన‌క్కి రాలేని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 132 లారీలు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న‌ పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లారీ డ్రైవ‌ర్లు,క్లీన‌ర్లు కూలీల‌ను పోలీసులు, అగ్నిమాప‌క శాఖ అధికారులు ప‌డ‌వ‌ల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story