ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

1288 New corona cases in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 31,116 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1288 కేసులు నిర్థార‌ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2021 5:46 PM IST
Corona cases in AP today

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,116 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1288 కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర‌, వైద్య ఆరోగ్య‌శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9,04,548కి చేరింది. అత్య‌ధికంగా గుంటూరులో 311 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ‌గోదావ‌రిలో 7 కేసులు న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే 610 మంది క‌రోనా నుంచి కోలుకోగా మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,88,508కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనా కార‌ణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 7,225 కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,51,46,104 శాంపిల్స్‌ను ప‌రీక్షించారు.


Next Story