ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

1246 New Covid-19 cases reported in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 Sept 2021 11:48 AM

ఏపీ క‌రోనా అప్‌డేట్‌.. పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 55,323 పరీక్షలు నిర్వహించగా.. 1,246 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,44,490కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ప‌ది మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,118కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,450 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,16,837కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,79,80,792 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Next Story