ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు..

116 New corona cases in AP.ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో 41,910 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..116 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Jan 2021 2:00 PM GMT
carona cases

ఏపీలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 41,910 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..116 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,836కి చేరింది. నిన్న ఒక్క రోజే 127 మంది కోలుకుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,79,405కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 24 కొత్త కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13, విశాఖ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గ‌డిచిన 24గంట‌ల్లో క‌రోనాతో ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమ‌హ‌మ్మారి కార‌ణంగా 7153 మంది మృత్యువాత ప‌డ్డారు.Next Story
Share it