ఏపీలో తగ్గని కరోనా ఉధృతి.. ఒకే రోజు 64 మరణాలు
New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 74,435 పరీక్షలు నిర్వహించగా.. 11,434 కేసులు నిర్ధరాణ అయ్యాయి.
By Medi Samrat Published on 27 April 2021 12:41 PM GMTఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 74,435 పరీక్షలు నిర్వహించగా.. 11,434 కేసులు నిర్ధరాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజటివ్ కేసుల సంఖ్య 10,54,875 కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,028 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 271 కేసులు చొప్పున నమోదు అయ్యాయి.
#COVIDUpdates: 27/04/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,51,980 పాజిటివ్ కేసు లకు గాను
*9,44,734 మంది డిశ్చార్జ్ కాగా
*7,800 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,446#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/YIwzishY0C
కోవిడ్ వల్ల నిన్న ఒక్కరోజే కోవిడ్ వల్ల విజయనగరంలో ఎనిమిది మంది, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలోఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, కర్నూ ల్ లో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, పశ్చి మ గోదావరి లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మొత్తం 64 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,800కి చేరింది. నిన్న ఒక్క రోజే 7,055 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 9,47,629కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,61,43,083 శాంపిల్స్ ను పరీక్షించారు.