గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 విధానాన్ని అమలు చేయాలి: షర్మిల

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కోరారు.

By అంజి  Published on  18 Aug 2024 6:38 PM IST
Group-1 Mains, YS Sharmila, Group-1 candidates

గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 విధానాన్ని అమలు చేయాలి: షర్మిల

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కోరారు. గ్రూప్‌-2, డీఈవో పోస్టులకు 1:100 విధానాన్ని అనుసరించారని, గ్రూప్‌-1 మెయిన్స్‌కూ దానినే పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రూప్‌ 2, గ్రూప్‌ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం, కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, గ్రూప్‌ 1 సిలబస్‌ను రివిజన్‌ చేయలేకపోవడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడం లాంటి కారణాలతో నష్టపోయామని అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని షర్మిల పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సాధ్యసాద్యాలు పరిశీలించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నామన్నారు.

''సివిల్ సర్వీసెస్ లో జనరల్ అప్టిట్యూడ్ విభాగం మొత్తం మార్కుల 33 శాతంతో అర్హత సాధించే విధానం ఉంటుంది. మెయిన్స్ పరీక్షకు జనరల్ స్టడీస్ పేపర్ లో సాధించిన మార్కులను మాత్రమే పరిగణిస్తారు. అయితే, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్ తో పాటు జనరల్ అప్టిట్యూడ్ విభాగంలో సాధించిన మార్కులను పరిగణిస్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల, గణితం, తెలుగు మీడియం నేపథ్య అభ్యర్థులపై ప్రభావితం చూపుతుంది. ఈ నేపథ్యంలో మా న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నామని షర్మిలకు గ్రూప్-1 అభ్యర్థులు లేఖ రాశారు.

Next Story