జగన్‌ ఆరు నెలల పాలనపై టీడీపీ స్పందన ఇదే..!

 Published on  30 Nov 2019 4:38 PM GMT
జగన్‌ ఆరు నెలల పాలనపై టీడీపీ స్పందన ఇదే..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఆరు నెలలు కావస్తోంది. ఈ సందర్భంగా ఒక వైపు వైసీపీ సర్కార్‌ చేపట్టిన పథకాలు, పాలన తీరుపై ప్రకటనలు చేస్తుంటే, మరో వైపు టీడీపీ మాత్రం దుమ్మెత్తిపోస్తోంది. ఆరు నెలల పాలనలో జగన్‌ సర్కారు చేసిందేమి లేదని ఆరోపించింది. జగన్‌ సర్కార్‌ ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని, అభివృద్దిలో జరగడం లేదని ఆరోపణలు గుప్పించింది. ఈ సందర్భంగా జగన్‌ ఆరు నెలల పాలనపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు తీసుకువచ్చిన కంపెనీల్లో వైసీపీ రిజర్వేషన్ అమలు చేసిందేందోనని దుయ్యబట్టారు. మత్స్యకారులకు ప్రత్యేక పింఛన్ మొదలెట్టింది చంద్రబాబేనని, చేపల రవాణా వాహనాలకు రాయితీ , డీజిల్ పై రాయితీ ఇచ్చింది చంద్రబాబునని, చివరకు మొత్తం వైసీపీ చేసినట్లు చెప్పుకుంటుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

టీడీపీ పాలనలో చంద్రబాబు రైతు భరోసా కింద 51.60 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ. 15వేలు ప్రకటిస్తే, ఆ పథకాన్ని 'అన్నదాతా సుఖీభవ' పేరుగా మార్చారని,అందులో లబ్దిదారుల్లో 6 లక్షల మందిని, రూ. 13,500కు తగ్గించింది ఎందుకని ప్రశ్నించింది టీడీపీ. అలాగే ఇసుక నిలిపివేసి, 60 మంది కార్మికులు చనిపోయాక, సిమెంట్లు రేట్లు పెంచి ఇసుక వారోత్సవాలు జరుపుతున్నారని, ఇది చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. అలాగే నేతన్న నేస్తంలో భాగంగా చేనేత రుణమాఫీ 110 కోట్లు మాఫీ చేసిందని, వారి ఉత్పత్తుల మార్కెటింగ్ కి ఆన్ లైన్ ఏజన్సీస్ తో ఒప్పందాలే కాక .. టీడీపీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో చేనేత స్టాళ్లను చేసింది చంద్రబాబేనని అన్నారు.

Next Story
Share it