బిగ్ బాస్ -3 విన్నర్ ఎవరో యాంకర్ రవికి తెలుసట..!!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Oct 2019 4:42 PM GMTబిగ్ బాస్-3కి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడబోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 6గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారి తరపున ఎవరి ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగుతున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్స్‌నే గెలిపించాలని పెద్ద ఎత్తున గొడవ పడుతున్నారు. సోషల్ మీడియాలో అభ్యర్ధిస్తున్నారు. మేం గొప్ప అంటే మే గొప్ప అంటూ సోషల్ మీడియాలో అక్షర యుద్ధం చేస్తున్నారు. తాజాగా.. ఈ ప్రచార యుద్ధంలోకి సెలబ్రిటీలు కూడా వచ్చారు. తమకు నచ్చిన వారికి మద్దతు ఇవ్వాలని అభిమానులను కోరుతున్నారు. శ్రీముఖికి రష్మీ మద్దతు తెలిపింది. అంతేకాదు..జబర్దస్త్ రాంప్రసాద్ కూడా మద్దతు తెలిపాడు. ఇక..యాంకర్ రవి తన బెస్ట్ ప్రైండ్ అలీ కి మద్దుతు ఇచ్చాడు.
ఫేస్ బుక్ లో యాంకర్ రవి
ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన రవి..బిగ్ బాస్ హౌజ్‌లోని అందరూ తనకు ఇష్టమేనన్నారు. కాని..తన మద్దతు అలీ రేజాకేనని ప్రకటించాడు. ‘అలీ రేజా నా కుటుంబ సభ్యుడులాంటి వాడు. ఇండస్ట్రీలో నా బెస్ట్‌ప్రెండ్ అతనే. మా ఇంట్లో పండుగైతే వాళ్లు వస్తారు.. వారింట్లో పండగైతే మేము వెళ్తాం. రంజాన్ పండగ రోజు బిర్యానీ పంపిస్తాడు. నాతో కలిసి దీపావళి పండుగ జరుకుంటాడు. మా మధ్య అంతమంచి బాండ్ ఉంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో అందరూ నాకు నచ్చివాళ్లే. కాని... అలీ నాకు సొంత అన్నలాంటివాడు. అందుకే సపోర్ట్ చేస్తున్నా. గేమ్ బాగా ఆడుతున్నాడు. అలీ మొదటి నుంచి 49 వరకు ఏంటో మీకు తెలుసు. ఎలిమినేట్ అయినప్పుడు నాతో పాటు అందరూ బాధపడ్డారు. అతను చాలా మంచోడు.గేమ్ బాగా ఆడుతుంటే ఎందుకు ఎలిమినేట్ చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. బయటకు వచ్చాక కూడా అలీని కలిశా. పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత బిగ్‌బాస్ టీం వచ్చి రీఎంట్రీకి అడిగినప్పుడు ఆలోచించాడు" అంటూ ఫేస్ బుక్ లైవ్‌లో రవి చెప్పాడు.
చెడ్డవాడని ఎలా చెబుతారు..?!
ఒక గంట చూసి ఒకరు మంచోడు ఒకరు చెడ్డోడు అలి ఎలా డిసైడ్ అవుతారు. అది ఒక గేమ్.. అంతా చూపించరు. దయచేసి ట్రోలింగ్ చేయకండి. అలీ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు. తెలుగు నేర్చుకున్నాడు. యాక్టింగ్ నేర్చుకున్నాడు. కష్టపడి సీరియల్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చి కూడా జన్యూన్‌గా ఆడుతున్నాడు. గేమ్‌లోకి వేళ్లేముందు అలీకి ససోర్ట్ చేస్తానని మాట ఇచ్చా. అందుకే సపోర్ట్ చేస్తున్నా అని రవి చెప్పాడు.
శ్రీముఖికి అందుకే సపోర్ట్ చేయడం లేదు
శ్రీముఖికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అందరూ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి నా కో యాంకర్ మాత్రమే. మా మధ్య మంచి బాండ్ ఉంది. శ్రీముఖి కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్ చేస్తున్నారు. అందరికి సపోర్ట్ చేయాలని ఉందా? శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. మీకు గొడవలు ఎందుకు? ఇకనైనా ట్రోలింగ్ ఆపండి’ అని రవి కోరారు. అయితే ఫైనల్స్‌కు ఎవరు వెళ్తారని నెటిజన్ అడగ్గా.. రాహుల్, అలీలు టాప్ వన్, టూలో ఉంటారని అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్ 3 విన్నర్ ఎవరో తనకు తెలుసని, అది మాత్రం ఇప్పుడు చెప్పనని రవి అన్నాడు.