నువ్వు అలా ఎలా వస్తావ్ అంటూ రష్మీపై ఫైర్ అయిన నెటిజన్లు
By రాణి Published on 20 March 2020 4:31 PM ISTఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో ఓ స్టోర్ ను ప్రారంభించేందుకు బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతర్ శుక్రవారం వచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాజమండ్రిలో తానొక స్టోర్ ప్రారంభానికి వస్తున్నట్లు రష్మీ ట్వీట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు రష్మీని చూసేందుకు వందల సంఖ్యలో ప్రజలు ఆ స్టోర్ వద్దకు చేరుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు వారందరినీ చెల్లా చెదురు చేసి వెళ్లగొట్టారు.
Also Read : భారత్ లో 204 కరోనా కేసులు..శ్రీలంకలో 4 రోజులు కర్ఫ్యూ
అయితే నెటిజన్లు మాత్రం రష్మీపై మండిపడుతున్నారు. అసలే కరోనా వైరస్ వస్తుంది..ప్రభుత్వాలు వీలైనంతవరకూ ఇళ్లకే పరిమితమవ్వండని చెప్తుంటే..నీకు ఇలాంటి పబ్లిక్ కార్యక్రమాలు చేయడం అవసరమా ? అసలు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యక్రమం అనంతరం ట్విట్టర్ లో లైవ్ లో మాట్లాడిన రష్మి నెటిజన్లందరికీ క్షమాపణలు చెప్పింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు రావాలని తాను అనుకోలేదు అని చెప్పింది. కరోనా వైరస్ ఉండటంతో ఎవరూ అక్కడి రారని అనుకున్నామని చెప్పింది.
Also Read : దేశ చరిత్రలోనే ఇలా ఉరితీయడం తొలిసారి..
ఇంతలో ఓ నెటిజన్ అందరూ షాపింగ్ చేయడం మానేస్తే..మీరు స్టోర్ ప్రారంభోత్సవానికి ఎలా వచ్చారని ప్రశ్నించాడు. ఇందుకు రష్మీ..''మనదేశంలో ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోరు. నిబంధనలు విధించినా..జరిమానాలు కట్టేద్దాంలే అనుకుంటారే తప్ప ముందు జాగ్రత్త చర్యలు పాటించాలనుకోరు. అలాగే వైరస్ వేడికి చచ్చిపోతుందంటున్నారు. మనం ఎంతో కలుషితమైన ఆహారం తింటేనే మనకేం కాలేదు. ఈ వైరస్ ఏం చేస్తుందిలే'' అనుకుంటారని బదులిచ్చారు.
Also Read : ఆన్ స్ర్కీన్..శ్రీదేవి కూతురి పెళ్లి..
అయితే స్టోర్ ప్రారంభోత్సవం కోసం సంబంధిత యాజమాన్యంతో తనకెప్పుడోనే ఒప్పందం కుదిరిందని, ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతిచ్చిందని రష్మీ గౌతమ్ తెలిపింది. అందుకే స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లక తప్పలేదని రష్మీ తెలిపింది.