యాంకర్ ప్రదీప్‌తో నాకు సంబంధమేంటి.. !

యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు.. ఇతని పేరు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర ద్వారా జనాల్లో మంచి ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. టీవీ షోల ద్వారా ప్రదీప్‌ అంటేనే పడిచచ్చేవారున్నారు. ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ చాలా ఉంది. గతంలో ఓసారి పోలీసులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడటం తప్ప ప్రదీప్‌పై ఎలాంటి మచ్చఅనేది లేదు. అలాంటి ప్రదీప్‌పై ఓ దర్శకుడు ఓ అమ్మాయితో సంబంధం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రదీప్‌ హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మార్చి 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ కలిసి సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాలపై భారీగానే అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలాఉంటే ఈ సినిమా ప్రమోషన్‌లో ఉన్న ప్రదీప్‌.. ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని, అంతేకాకుండా ఆమెను మోసం చేశాడని సునిశిత్‌ అనే డైరెక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కొన్ని రోజుల కిందట ప్రదీప్‌ ‘పెళ్లి చూపులు’ అనే షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరితో అతడు డేటింగ్‌ చేశాడని కామెంట్‌ కూడా చేశాడు. ఈ విషయంపై సదరు అమ్మాయి జ్ఞానేశ్వరి స్పందించింది. తనకు సినిమాలపై, టీవీ షోలపై పెద్దగా ఆసక్తి ఏమి ఉండదని చెప్పింది. తాను ఇప్పుడు ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపింది.

తన సహచరుడు తీసిన షార్ట్‌ ఫిలింలో సరదాగా నటించానని, అదే క్రమంలో పెళ్లి చూపులు షోలు పాల్గొన్ననని చెప్పుకొచ్చింది. ప్రదీప్‌తో తనకు ఎలాంటి లింక్‌లేదని క్లారిటీ ఇచ్చేసింది జ్ఞానేశ్వరి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడిపై నేటిజన్లు తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.