మధుమేహానికి పగ్గాలు వేసే ఇంజక్షన్‌ వచ్చిందోచ్...!

By Newsmeter.Network  Published on  21 Nov 2019 4:16 PM GMT
మధుమేహానికి పగ్గాలు వేసే ఇంజక్షన్‌ వచ్చిందోచ్...!

ముఖ్యాంశాలు

  • మధుమేహంపై సిసీఎంబీ విజయం
  • మధుమేహాన్ని అరికట్టడానికి కొత్త ఇంజక్షన్ కనుగొన్న సీసీఎంబీ
  • ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతం

హైదరాబాద్ : ప్రతి ఏడాది మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల జనాభాను కబలిస్తోంది. ఇండియాలోనే దాదాపు 60 మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి జీవన ప్రక్రియకు సంబంధించిన ఇన్సులిన్‌ను సీసీఎంబీ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. రక్లంలో చక్కెర అధికమైతే ఈ వ్యాధి వస్తుంది. జీవకణాల్లో అనేక ఒత్తిళ్లు మధుమేహం రావడానికి కారణం అవుతున్నాయి. ఇప్పటి వరకు మధుమేహానికి దారి తీసే పరిస్థితులపై అవగాహనలేదు.

సీఎస్‌ఐఆర్‌ - సీసీఎంబీలో యోగేంద్ర శర్మ నాయకత్వంలో ఆనంద్ శర్మ, రాధిక ఖండేవాల్‌లు మధుమేహానికి అరి కట్టడానికి ముందడుగు వేశారు. సెక్రటో గోగిన్‌ అనే ప్రోటిన్‌..ఇన్సులిన్‌తో కలిసి స్థూలకాల ప్రభావం వలన కలుగుతున్న మధుమేహాన్ని నియంత్రిస్తుందని గుర్తించారు. వివిధ ఒత్తిళ్లను తగ్గిస్తూ..ఇన్సులిన్‌ను స్థిరీకరిస్తున్నట్లు కనుగొన్నారు.

ఎలుకలకు సెక్రటోగొగిన్ ఇంజక్షన్ ఇవ్వడం వలన రక్తప్రసరణలో ఉన్న ఇన్స్‌లిన్‌ను తగ్గించడం, కొవ్వును నియంత్రించడం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రొటిన్ ఇంజక్షన్‌ వలన కణాల్లో కొలస్ట్రాల్, కొవ్వు తగ్గుతాయని తెలిసింది. ఈ పరిశోధన గురించి జాతీయ విజ్ఞాన పత్రికల్లో ప్రచురించారు. జీవశాస్త్రాల్లో ప్రాధమిక పరిశోధనలు వివిధ సమస్యలకు పరిష్కారాలు ఎలా చూపిస్తాయో చూపించామని సీసీఎంబీ నిర్దేశకులు డా. రాకేష్ మిశ్రా తెలిపారు.

Next Story