ఏడాదిన్నర క్రితం కిరాతకంగా హత్య గావించబడి తెలుగు రాష్ర్టాల్లోసంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య, అమృతా ప్రణయ్ ల ప్రేమకథ నేపథ్యంగా..ఒక చిత్ర తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుండగా..చిత్రంలో నటిస్తున్న బాలాదిత్య సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. దర్శకుడు శివనాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎన్ఆర్ చౌదరి నిర్మాతగా ఉండగా.. ఆయన కుమారుడు మాస్టర్ రవితేజ టైటిల్ రోల్(చిన్నతనంలో ప్రణయ్) ప్లే చేశాడు. సీనియర్ నటీమణులు అన్నపూర్ణ, జమునలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : అమృతపై శ్రీరెడ్డి కామెంట్స్.. నెటిజన్ల స్పందనతో డిలీట్ చేసి మళ్లీ..

ఈ సినిమా కథను తమ దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో రాసుకున్నట్లు చెప్పాడు బాలాదిత్య. కాగా..వాస్తవంగా జరిగిన ఘటనలను సినిమాలో చూపిస్తూనే..వాటికి కాస్త సినిమా టచ్ కూడా ఇస్తున్నారని వెల్లడించాడు. ఈ చిత్రంలో బాలాదిత్య ప్రణయ్ పాత్రలో నటించగా..అర్చన అమృత పాత్రలో ఒదిగిపోయిందట. గతేడాది నవంబర్ లోనే ఈ సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్ జరిగింది..ఈ నెలలోనే చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాగా..మారుతీరావు ఆత్మహత్యతో మళ్లీ అమృతా ప్రణయ్ ల కథ అందరి నోళ్లలో నానుతోంది.

Also Read :నెటిజన్ కామెంట్..రష్మీ కౌంటర్

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.