సోషల్ మీడియా..ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టా ఇతరత్రాల పుణ్యమా అని సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్యనున్న దూరం తగ్గిపోయింది. ఒక సెలబ్రిటీ ఏ పోస్ట్ పెట్టినా..వారి అభిమానులకు దానికి చాలా త్వరగా స్పందిస్తున్నారు. అక్కడి వరకూ సంతోషమే కానీ..అభిమానులతో పాటు విమర్శకులు కూడా స్పందిస్తున్నారు. సంబంధిత పోస్టులపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి కామెంట్లకు ఎక్కువగా యాంకర్ సెలబ్రిటీలు, టాలీవుడ్ హీరోయిన్లు బాధితులైన సందర్భాలున్నాయి.

Also Read :
చైతూ ట్వీట్ కు స్పందించిన సెలబ్రిటీలు..సమంతాతో సహా..

తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ హోలీ సందర్భంగా ఒక ట్వీట్ చేయగా..నెటిజన్ దానిపై ఘాటు విమర్శ చేశాడు. దానికి రష్మీ కూడా స్ర్టాంగ్ కౌంటరే ఇచ్చింది. ఇది రష్మీకి కొత్తేం కాదు కానీ..ఎప్పటిలాగానే మరోసారి రష్మీ చేసిన ట్వీట్ వార్తల్లోకెక్కింది.

Rashmi Tweet

”హోలీ పండగ నాడు కుక్కలపై రంగులు చల్లకండి అంటూ కామెంట్ చేసింది. మనపై రంగు పడితే సబ్బుతో కడుక్కుంటాము.. కానీ జంతువులు ఆ పని చేయలేవు” అని రష్మీ గౌతమ్ ట్వీట్ చేసింది. నిజానికి రష్మీ చెప్పిన దానిలో తప్పేం లేదు. కానీ ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘అచ్చా.. పండగలు పబ్బాలు వచ్చినపుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తాయా ? మన పండగల విశిష్ఠతను తగ్గించేలా ఇలాంటి సందేశాలు ఇస్తున్నారా. ముందు మీ చుట్టూ ఉన్న మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి.’ అని కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ పై స్పందించిన రష్మీ..”నాపై ఇలాంటి కామెంట్లు పెట్టే ముందు ఒకసారి నేను ఇంతకుముందు చేసిన పోస్టులను కూడా చూడండి” అని స్ర్టాంగ్ రిప్లైయ్యే ఇచ్చింది.

ఏదేమైనా రష్మి చెప్పింది కూడా కరెక్టే కదా బ్రదర్ అంటూ..నెటిజన్లు రష్మీకే సపోర్ట్ ఇచ్చారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.