అమ్మరాజ్యంలో కడప బిడ్డలు 'రివ్యూ'..
By Newsmeter.Network
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి వివాదస్పదం అవ్వడం.. ఆతర్వాత సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేయడం.. తెలిసిందే. దీంతో అసలు ఈ సినిమా ధియేటర్ లో రిలీజ్ అవుతుందా..? లేక యూట్యూబ్ లోనే రిలీజ్ చేస్తారా..? ఇలా చాలా సందేహాలు. ఆఖరికి సెన్సార్ అడ్డంకులను తొలిగించుకుని వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను ఈ రోజు (డిసెంబర్ 12)న రిలీజ్ చేసారు. మరి.. ఈ వివాదస్పద చిత్రం ఆకట్టుకుంటుందా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిదే.
కథ - ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. వి.ఎస్. జగన్నాథ్ రెడ్డి (అజ్మిల్ అమర్) ముఖ్యమంత్రి అవుతారు. అప్పటి వరకు పరిపాలించిన వెలుగు దేశం పార్టీకి ఘోరం పరాభవం ఎదురవుతుంది. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకున్న బాబుకు పార్టీ ఓడిపోవడంతో షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్నాధ రెడ్డిని పదవీచ్యుతుడిని చేయడానికి బాబు ఓపికగా ఎదురు చూస్తుంటాడు. బాబు సన్నిహితుడు దయనేని రామ ఒక అమాయక వ్యక్తిని చంపి, సీఎం పై నిందలు వేస్తే, అతని ప్రభుత్వం పడిపోతుందనే ఆలోచనను బాబుకు చెబుతారు. ఇలా ప్రతిపక్షం కుట్రలు చేస్తుంటుంది. కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వి.ఎస్.జగన్నాథ్ రెడ్డికి ఎదురైన సవాళ్లు ఏంటి..? వాటిని ఎలా అధిగిమించారు..? అనేదే ఈ కథ.
విశ్లేషణ - ఇది స్పూఫ్ కాదు, రాజకీయ డ్రామా కాదు.. థ్రిల్లర్ అంతకన్నా కాదు. ఇది పేలవంగా వ్రాసిన స్పూఫ్‌ల సమ్మేళనం. ఇంకా చెప్పాలంటే... వైరల్ అయిన కొన్ని వాట్సాప్ వీడియోల రీమేక్ అని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో స్టార్ట్ అయిన ఈ చిత్రం ప్రారంభం కాస్త బాగున్నట్టే అనిపిస్తుంది అయితే పొలిటికల్ థ్రిల్లర్‌గా కాకుండా ట్రోల్ వీడియోల కంటెంట్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.
ఎటువంటి కారణం లేకుండా పాత్రలు వస్తాయి.. వెళుతుంటాయి. అసలు ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్ధం కాని విధంగా సీన్స్ ఉన్నాయి. వర్మ గత చిత్రం “లక్ష్మి ఎన్టీఆర్” విడుదలను నిలిపివేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తన వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి ఆర్జీవీ చేసిన కసరత్తు ‘అమ్మ రాజ్యమ్లో కడప బిడ్డలు’ఇది అని చెప్పచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ మరియు కెఎ పాల్ పాత్రలను కూడా చిత్రంలోకి తీసుకువచ్చారు. ఈ సన్నివేశాలు మిమిక్రీ షో నుండి నేరుగా తీసినట్లు కనిపిస్తాయి.
పస్టాఫ్ ఇలా ఉంటే.. ఇక సెంకడాఫ్ అయితే సినిమా చూసే ఆడియన్ కి ఏంటీ సినిమా..? వర్మా.. ఏంటి ఈ ఖర్మ ? అని తలపట్టుకునేలా ఉంది. కాస్టింగ్ మాత్రం పర్ ఫెక్ట్ అనేలా ఉంది. కె.ఎ. పాల్ పాత్ర అక్కడక్కడా నవ్విస్తుంది. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ఏమాత్రం ఆకట్టుకోలేని బోరింగ్ మూవీ.