చలికాలంలో ఉసిరికాయలు తినడం వల్ల ఉపయోగలేంటో తెలిస్తే..
By సుభాష్ Published on 30 Dec 2019 9:00 PM ISTచలికాలంలో ఉసిరికాయలు ఎక్కవగా లభిస్తుంటాయి. ఈ సీజన్ వచ్చిందంటే ఉసిరికాయలు తినడం ఎవ్వరు మర్చిపోరు. ఉసిరితో ఉన్న లాభాలను చూస్తే ప్రతి ఒక్కరు తినకుండా ఉండలేరు. ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలను ఉసిరికాయలు తరిమికొట్టేస్తోంది. ఈ సీజన్లో ఉసిరికాయలు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో వైద్యులు వివరిస్తున్నారు. ఉసిరికాయల్లో విటమిన్ సి ఉంటుంది. నారింజ, నిమ్మ, దానిమ్మకాయల కన్నాఎక్కవ విటమిన్ సి ఉసిరికాయల్లో లభిస్తుంది. అందుకే ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా తింటే సి విటమిన్ లోపం రాకుండా ఉంటుంది.
ఉసిరికాయలు తినడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెంచుతుంది. దగ్గు, జలుబు, ప్లూ జ్వరం రాకుండా ఎంతో ఉపయోగపడుతుంది. చలికాలంలో జీర్ణ ప్రక్రియ మందగిస్తుందని, అలాంటప్పుడు ఎక్కువగా ఉసిరికాయల రసాన్ని తాగితే ఆహారం చక్కగా జీర్ణమవుతుందని వైద్యులంటున్నారు. ఇక డయాబెటిక్ ఉన్నవారికి ఎంతో మంచిది. ఇవి తినడం వల్ల ఇన్సులిన్ చురుగ్గా లభించడమే కాకుండా, రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. అలాగే ఈ కాలంలో చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసం ఎంతో ఉపయోగపడుతుంది. వెంట్రుకలు తెల్లబడకుండా, రాలిపోకుండా కాపాడుతుంది.
అలాగే ఇందులో పిండి పదార్థాలు, పీచు అధిక స్థాయిలో ఉంటాయి. క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. కాలేయ వ్యాధులకు ఉసిరి ఎంతో ఉపయోగపడుంది. అంతేకాకుండా నాడులను బలోపేతం చేయడమే కాకుండా మెదడు పని తీరు మెరుగుపర్చడంలో ఉసిరి ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉసిరికాయలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే మహిళల్లో రుతు సమస్యలు వంటికి ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. ఉసిరి తినడం వల్ల కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.