వివాదానికి తెర దించిన అమిత్ షా
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 18 Sept 2019 7:39 PM IST

న్యూఢిల్లీ: హిందీపై రెండ్రోజులుగా దుమారంరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే..దీనిపై కేంద్ర హోంమంత్రి వివరణ ఇచ్చుకున్నారు. హిందీని రెండో భాషగా మాత్రమే నేర్చుకోవాలని మాత్రమే తాను అన్నానన్నారు. అనవసరంగా కొంత మంది తన వ్యాఖ్యలను వక్రీకరించారని వాపోయారు. తాను కూడా నాన్ హిందీ స్టేట్ నుంచే వచ్చానన్నారు అమిత్ షా. గత రెండ్రోజులుగా అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. అమిత్ షా మాటలను కర్నాటక సీఎం యడ్యూరప్ప తీవ్రంగా ఖండించారు. ఇక తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ భగ్గుమన్నారు. రజనికాంత్ కూడా అమిత్ షా మాటలను తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో అమిత్ షా తన మాటలపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story