ఎన్‌ఆర్‌సీపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. తీవ్ర రాజకీయ దుమారం
By న్యూస్‌మీటర్ తెలుగు
చండీగఢ్: అస్సాంలో విజయవంతంగా ఎన్ఆర్‌సీని అమలు చేశామన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర పట్టిక) పై షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి వారి వారి మాతృదేశాలకు పంపిస్తామని తెలిపారు. అక్రమ వలదారుల వల్ల దేశ ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాలు అందడం లేదని అమిత్ షా పెర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, ఎన్‌ఆర్‌సీ అమలుపై కాంగ్రెస్ అనవసరంగా గోల చేస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు.